Take a fresh look at your lifestyle.

హద్దుమీరి ప్రవర్తిస్తే ప్రజలు గుణపాఠం చెప్తారు…నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి

0 40
రాష్ట్రంలో అరాచక పాలన ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వచ్చింది. డబ్బులు, పథకాలు కొంత వరకే పనిచేస్తాయి. ఏం కొంపలు మునిగిపోయాయని పండగ రోజున నామినేషన్ వేయిస్తున్నారు.? ఇప్పుడు జరిగే ఎన్నికలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేవి. వైసీపీ చేసిన అవినీతి, అరాచకాన్ని ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు వివరిద్దాం.
రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపాలన నడుస్తోంది. దీపావళిని హిందువులంతా ఆనందంగా జరుపుకుంటారు. అలాంటి పండుగ రోజున ఎన్నికలు పెట్టారంటే ఈ ముఖ్యమంత్రి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తున్నారా? పలానా రోజులో ఎలక్షన్ అయిపోవాలని ముఖ్యంత్రి కేబినెట్ మీటింగ్ లో చెప్తే.. ఎస్ఈసీ దానికి తానాతందానా అంటూ నోటిఫికేషన్ ఇచ్చారు. 
ఏం కొంపలు మునిగిపోయాయని పండగ రోజు ఎన్నికలు పెడుతున్నారు. మీ నెత్తినేమైనా కత్తివుందా..ఎస్ఈసీ.? మీ ఇష్టానుసారంగా ఒక మతం మనోభావాలు దెబ్బతీసేలా పండగరోజు నామినేషన్ వేయాలా.? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అభ్యర్థులు, పార్టీ నాయకులకు 16 సూచనలు పంపుతున్నా. వైసీపీ నేతలు ఎన్నికలను ప్రహసనంగా తయారు చేశారు. నీచాతి నీచంగా తయారు చేశారు. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరును నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదు. పోలీసులు వచ్చి నామినేషన్లు వేయకుండా బెదిరించారు. 
నామినేషన్ వేయడానికి వెళ్తున్న వారిని అడ్డుకున్నారు. అయినా ముందుకు వెళ్లిన వారిని తరిమికొట్టారు. ఒకవేళ నామినేషన్ వేసినా రక్షణ కల్పించాల్సిన పోలీసులే వెంటాడారు. అధికార పార్టీకి కొమ్ముకాసే కొందరు అధికారులు నామినేషన్ పత్రాలు చించేశారు. మరికొన్ని పరిశీలనలో సరిగా లేవని అకారణంగా తొలగించారు. అన్నీ అధికమించి పోటీలో నిలబడితే లైట్లు ఆపి ఫలితాలను ప్రకటించుకున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం, ఎగతాలి చేయడం కాదా.? ఉన్మాదులు, పిచ్చోళ్లు ఇలాంటి పని చేస్తారు. ఎన్నికలు సజావుగా జరగాలని కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. అక్కడి నుండి కొన్ని ఆదేశాలు వచ్చాయి. 
అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి:
1. నామినేషన్ వేసే అభ్యర్థి ఆర్.ఓకు పత్రాలు సమర్పించే ముందు వాటిని స్కాన్ చేసి ఆన్ లైన్ లో ఆర్.ఓ, జిల్లా కలెక్టర్, ఎన్నికల పరిశీలకులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పంపించాలి.
2. అనంతరం వాటిని ఆర్వోకు సమర్పించాలి. అనంతరం స్కాన్ చేసిన నామినేషన్ పత్రాలను కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు, ఎలక్షన్ కమిషన్ కు పంపించాలి. మీకు నామినేషన్ పత్రాలు మెయిల్ ద్వారా పంపించామని ఆర్వోకు చెప్పాలి. అయినా ఆర్వోలు డ్రామాలు ఆడితే జైలుకు పోతారు. ఎక్కడున్నా తప్పు చేస్తే వెంటాడతాం. కోలుకోలేని దెబ్బ తీస్తాం.
3. అభ్యర్థి నామినేషన్ వేసే సమయంలో ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. గతంలో అధికారులు సహకరించేవారు. తప్పులున్న చోట సరిచేసుకోవాలని సూచించేవారు. కానీ అధికార పార్టీకి కొమ్ముకాసే వారు చెల్లవని చెప్పే ప్రమాదం వుంది. 
4. అన్ని పత్రాలను అడ్వకేట్ ను పెట్టుకుని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. 
5. మోటార్ వెహికల్ మీ పేరుతో వుంటే ఫైన్ వేసిన సంగతి కూడీ మీకు తెలియదు. అలాంటివి కూడా పరిశీలన చేసుకుని కట్టుకోవాలి. 
6. పోలీస్ కేసులు మనకు తెలియకుండా పెడుతున్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్లో వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇస్తారు లేకుంటే ఆన్ లైన్ లో తీసుకోవాలి. నామినేషన్ పత్రంలో ఇచ్చిన ఆప్షన్లకు ఎలాంటి ఖాళీ వుండకూడదదు. అవికూడా సాకుగా చూపిస్తారు. 
7. ప్రతి నామినేషన్ ను అడ్వకేట్ కు చూపించి, అడ్వకేట్ సమక్షంలో నామినేషన్ వేసేలా జాగ్రత్త తీసుకోవాలి. 
8. మిగతా ఇద్దరు అభ్యర్థులు కూడా డమ్మీ నామినేషన్లు కూడా నిబంధనలు ప్రకారం పూర్తి చేసుకోవాలి.
9. నామినేషన్ పత్రాలు పూర్తి చేయడం, అనుబంధ పత్రాలు జత చేసేటప్పుడు  ఎన్నికల సంఘ నియమావళి, సూచనలు తప్పని సరిగా చూసుకోవాలి. 
10. ఒక నామినేషన్ పత్రాన్ని ఆర్వోకు ఇచ్చాక నకలు పత్రాలు మనవద్ద ఒక జత వుంచుకోవాలి.
11. ఆర్వోకు నామినేషన్ పత్రం అందించాక స్టాంపులు వేసిన తర్వాత చెక్ లిస్టుతో ఎక్నాలెడ్జెమెంట్ తీసుకోవాలి. లేకుంటే ఎన్ క్లూయిజర్స్ తీసేసి నామినేషన్ చెల్లదని చెప్పే ప్రమాదం వుంది. 
12. ఎన్నికల సంఘం ఇచ్చిన సూచనల ప్రకారం నామినేషన్ కు వెళ్లినప్పుడు వీడియో తీయాల్సిన బాధ్యత ఆర్వోపై వుంది. తీస్తున్నారా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. 
13. చెక్ లిస్టుతో కూడిన ఎక్ నాలెడ్జ్ మెంట్ ను కచ్చితంగా వెంటనే కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు, ఎన్నికల కమిషన్ కు పంపించాలి. 
14. చెక్ లిస్టుతో కూడిన ఎక్ నాలెడ్జ్ మెంట్ నామినేషన్ కు ముందు మీడియాకు విడుదల చేయాలి. సోషల్ మీడియాలో పెట్టాలి. అప్పుడు ఏ సమయాన మనం నామినేషన్ వేశామో వుంటుంది. 
15. ఎవరికైనా బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే రికార్డ్ చేయండి. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు అవకాశం లేదు. ఆంబోదులు మాదిరిగా వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. మీ రౌడీలు, మీ పోలీసులు శాశ్వతమా.? 
16. దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయో అన్నీ లిస్టు తయారు చేసి ఆర్వోకు ఇవ్వాలి. ఇవన్నీ పగడ్బందీగా చేస్తే వీళ్లెవరూ గెలవరు.. గెలిచే పరిస్థితి లేదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వంపై వుంది. వ్యతిరేకత వచ్చాక ప్రజల్ని మభ్యపెట్టేందుకు అది, ఇదీ చేశామని కబుర్లు చెప్తున్నారు. డబ్బులు, పథకాలు కొంత వరకే పనిచేస్తాయి.హద్దుమీరి ప్రవర్తిస్తే ప్రజలు గుణపాఠం చెప్తారు.  ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తామంటే ఆరోజులు పోయాయి.
గత ఎన్నికల్లో పుంగనూరు మున్సిపాలిటీలో కమిషనర్ లోకేశ్వర్ వర్మపై ఎన్నికల సంఘానికి గతంలో ఫిర్యాదు ఇచ్చాం. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి, కింద అధికారులను లోబరుచుకుని, పోలీసులు కూడా వైసీపీకి అనుకూలించి ఏకపక్షంగా చేసుకునేలా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. వాటిన్నింటికీ ఈ లోకేశ్వర్ వర్మ లోగుట్టు ఆదేశాలు ఇచ్చారు. గతంలో పుంగనూరులో జరిగినవన్నీ ఆధారాలతో సహా చూపించాం. పుంగనూరులో 24 మంది అభ్యర్థులు ధైర్యంగా టీడీపీ తరపున నామినేషన్ వేశారు. 
నామినేషన్లు అన్నీ చించేసి 24 నామినేషన్లు ఏకగ్రీవం చేశారు. 8,9, 14,15 వార్డులకు కొత్త నామినేషన్ వేసే అవకాశం అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చారు. ఫోటోలు చూపిస్తూ…. పెద్దిరెడ్డ రామచంద్రారెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో కమిషనర్ లోకేశ్వర వర్మ పాల్గొన్నారు. మిథున్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన కూడా పుంగనూరు వ్యక్తే. 
ఇప్పుడు అతన్ని కుప్పంలో వేశారు. పెద్దిరెడ్డికి చెంచా. పెద్దిరెడ్డి ఇంట్లో పెట్టుకో. 25 శాతం మాకు వచ్చింది. దాన్ని తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారు. పోలీసులను, అవినీతి పరులను పెట్టుకుని అక్రమాలు చేస్తున్నారు. వెలుగు సిబ్బంది, సంఘమిత్రులతో సమావేశాలు పెట్టి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయాలని చెప్తున్నారు. 
కింది అధికారులను పిలిచి ఏకగ్రీవం చేయాలని చెప్తున్నారు. 
ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ఏకైక పార్టీ టీడీపీ. ఆగస్టు సంక్షోభంలోనూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే 30 రోజులు పోరాడి తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాతే ఇంటికి వెళ్లి ప్రజలు, కార్యకర్తలు పడుకున్నారు. 
మిమ్మల్ని చరిత్ర హీనులుగా నిలబెడతాం.మీకు ఎన్నికల అధికారులు సహకరించవచ్చు. ఉన్నాద పాలన పెట్టుకుని చేస్తామంటే కుదరదు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి. ఏం చేస్తోంది ఎన్నికల కమిషన్.? ఫిర్యాదులు ఉన్న అధికారులను ఎన్నికల్లో వేస్తారా.?  ఏం చేసినా అడిగేవారు లేరని, ముఖ్యమంత్రి తుగ్లక్ ఉన్నాడు, అడిగింది చేస్తాడని అనుకుంటున్నారు. మీ అంతం ప్రారంభం అవుతుంది గుర్తుంచుకోవాలి. 
గురజాల ముస్లిం మహిళ నజరన్ వీడియో ప్రదర్శన…….
 ‘‘నా పేరు నజరన్, నేను 9 వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ వేయడానికి ఫోటోల కోసం స్టూడియోకు పోలీసులు అక్కడే ఉన్నారు. ఎక్కడికమ్మా అని అడిగారు. వెంటనే రెండు అడుగులు వేసే సరికి ఎవరో వచ్చి పత్రాలు లాక్కుని వెళ్లారు. సర్ కవర్ లాక్కెళ్తున్నారని కేకలు వేస్తే పోలీసులు కనీసం స్పందించలేదు. ఆడమనిషి చేతిలో కవర్ లాక్కెళ్తుంటే చూస్తూ ఊరుకుంటారా? నేను హైకోర్టులో పిటిషన్ కూడా వేశా రక్షణ కావాలని. దగ్గరున్నప్పుడే రక్షణ ఇవ్వలేదు. మాకు న్యాయం జరగాలి. సర్టిఫికేట్లు మొత్తం చించేశారు. పోలీసులు రాలేదు. ఇదేనా మీ రక్షణ. కలెక్టర్ కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం’’.
సాక్షాత్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా నిబందనలు పాటించలేదు. పార్టీలు, మీడియా, ప్రజలంటే భయం లేదు, న్యాయస్థానాలన్నా భయం లేదు. ఇది ఉన్మాద, తుగ్లక్ చర్య కాకపోతే మరేమిటి? మైనారిటీ ఆడబిడ్డ సర్టిఫికేట్లు చించేస్తారా.? ఇదేనా ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించే తీరు.? మీకు చేతకాకపోతే రాజీనామా చేసి వెళ్లండి. ఇష్టానుసారంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు. చాలా మందిని చూశాం. కరెక్టుగా చేస్తే అభినందనలు చెప్తాం. చట్టాన్ని వేరే వాళ్ల చేతిలో పెడితే చూస్తూ ఊరుకోం.
రంపచోడవరంలో ఆంబోతులు బరితెగించారు. 
ఫోన్ కాల్ ఆడియో : 
ఫోన్ చేసిన ఆగంతకుడు : మీరు నామినేషన్ వేస్తే తీవ్రమైన పరినామాలు వుంటాయి. మీకు ఏప్యాకేజీ రాదు. ప్రభుత్వం నుండి ఏమీ రాకుండా చేస్తాం. అర్థమైందా.?
అభ్యర్థి : ఎవరండీ మీరు. ఎవరు అసలు మాట్లాడేది. 
అగంతకుడు : నేను చెప్తున్నాను కదా. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాదు. వైస్ ప్రెసిడెంట్ వెంట వుంటా. మీరు నామినేన్ విత్ డ్రా చేసుకోండి. వైసీపీ, టీడీపీ తరపున వేయకుండా ఇంట్లో కూర్చోండి, ఎవరూ ఫిర్యాదు చేయరు. ఆర్ అండ్ ఆర్ కోసం ఇల్లు వేసుకున్నారని చెప్తాం. నామినేషన్ వెనక్కు తీసుకుంటే రేపొద్దున నేనే కంప్లైంట్ ఇస్తా. మీరు ఇక్కడ వుండరు అని జెడ్పీటీసీని తీసుకెల్లి ఆర్వోకు నేనే కంప్లైంట్ ఇస్తా. 
అభ్యర్థి : మీరెక్కడ ఉన్నారండి
అగంతకుడు : నేను కాసారంలో ఉన్నా. మేం అధికార పార్టీలో ఉన్నా. మీకు ఆర్ అండ్ ఆర్, అన్ని సంక్షేమ పథకాలు వర్తించాలని కోరుకుంటున్నా. నేను అల్లాటప్పా మనిషి కాదు..వైస్ ప్రెసిడెంట్. ప్రతి విషయంలో వెంకన్న చేశాడని చెప్తున్నా. వీఆర్వోకు ఫిర్యాదు చేశా. అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. అది చూసుకోండి.
వీళ్లందికీ లైసెన్స్ వచ్చింది. వైస్ ప్రెసిడెంట్ కు సర్వాదికారాలున్నట్లు బెదిరిస్తున్నాడు. ప్రజలు తిరగబడితే ఊరు వదిలి పారిపోతారు. గుర్తుంచుకోండి. 
బాధితురాలితో ఫోన్లో చంద్రబాబు
చంద్రబాబు : నీ పేరేంటమ్మ.?
శిరీష : నాపేరు శిరీష సర్, నేను కూనవరం మండలం, కాసారంలో ఉంటాం. 
చంద్రబాబు : చెప్పమ్మా ఏం జరిగింది.?
శిరీష : కాసారం గ్రామంలో నామినేషన్ వేశాను సర్.  వైస్ ప్రెసిడెంట్ పోన్ చేసి  నామినేషన్ విత్ డ్రాచేసుకోండి, లేకపోతే తీవ్ర పరిణమాణాలుంటాయి.  ముందే చెబుతున్నాం. ఊర్లో నివాసం కూడా ఉండలేరని బెదిరించారు. మా బందువులకు కూడా పోన్ చేసిబెదిరించారు. స్ధానిక నాయకుల్ని సంప్రదిస్తే మాకు దైర్యం చెప్పారు. మీకు ఎలాంటి పథకాలు రానీవవ్వం,  ఆదార్, ఓటర్ ఐడి ఉంది, అన్ని ఉన్నాయి. 2 నెలల్లో డెలివరకి వచ్చాం. ఎందుకలా మాట్లాడుతున్నారన్నా వినలేదు.  మమ్మల్ని భయపెడుతున్నార్ సర్. మాకు భయంగా ఉంది.  మాకు, మా పిల్లల్ని ఏం చేస్తారోనన్న భయం ఉంది. నామినేషన్ వేస్తేనే ఇలా చేస్తున్నారు. సర్ మాకు మీరు అండగా ఉండాలి.
చంద్రబాబు : వాళ్లకు పోగాలం దగ్గరపడింది, అందుకే ఇలా వ్యవహరిస్తున్నారు. దైర్యంగా ఉండమ్మా…అన్ని విధాలుగా అండగా ఉంటాం… నేను నెం. ఇస్తాం.  ఏ ఇబ్బంది వచ్చినా పోన్ చేయండి, డైరెక్టర్ గా నేనే మాట్లాడుతా. మీరేం తప్పు చేయటం లేదు, ప్రజాస్వామ్య రక్షణకు పాటుపడుతున్నారు. దైర్యంగా ఉండమ్మ భయం అవసరం లేదు. 
ఇలాంటి వింతలు ఎప్పుడైనా చూశామా? ప్రజలు ఆలోచించాలి. ఎన్నికలంటే ఊరికొక ఆంబోతు , రౌడీలు తయారై ప్రజల్ని బెదిరిస్తున్నారు. జగన్ కంటే పిచ్చి పిట్టనట్టు వీళ్లకు కూడా పట్టింది.  ఒళ్లు దగ్గరపెట్టుకోండి. రేపు అనే ఒక రోజు ఒకటి ఉంది. మీకు అంత భరోసా వుంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రండి ప్రజలు మీ బట్టలూడదీస్తారు? మీలాగా మేం మాట్లాడలేమా? మేం దాడులు చేయలేమా? కానీ మా సంస్కారం అది కాదు.  
నెల్లూరు, గురజాల, బేతంచెర్ల ఎన్నికలపై లేఖ రాస్తే ఒక కాగితం మాత్రం చూశారు. ఈసీ పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. కోడ్ వచ్చాక అందరూ దాని పరిధిలో ఉండాలి. ముఖ్యమంత్రి, మంత్రులు, సాక్షి గుమాస్తా ఇష్టమెచ్చినట్టు వ్యవహరిస్తామంటే కుదరదు. స్టేట్ స్పాన్సర్ద్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. మాపై, ఆపీసుపై దాడి చేసినపుడు పోలీసు పట్టుబడిన వ్యక్తిని గౌరవంగా పోలీసులకు అప్పగిస్తే తిరిగి లోకేష్, అశోక్ బాబు, ఆలపాటి రాజా, శ్రవణ్ కుమారె, బ్రహ్మంలపై కేసు పట్టారు. బ్రహ్మాన్ని ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరిస్తారా? డీజీపీగా నువ్వు పనికిరావు, ఇంటి కెళ్లు.  ఉద్యోగం కోసం కక్కుర్తి రాజకీయాలొద్దు. హెరాయిన్ అడ్రస్ విజయవాడ చిరునామాతో దొరికింది వాస్తవం కాదా? గంజాయి అరికట్టమంటే నక్కా ఆనందబాబు కు పోలీసులు నోటీలిస్తారా? ఇతర రాష్ట్రాల పోలీసులొచ్చి గంజాయి స్మగ్లర్లపై కాల్పులు జరుపుతుంటే మీకు సిగ్గులేదా?
ఇవాళ విశాఖ ఆగనంపూడిలో 1200 కిలోల గంజాయి పట్టుబడింది.. దీనికి డీజీపీ ఏం సమాధానంచెబుతారు? గంజాయి గురించి మాట్లాడితే ఆనంద్ బాబు మీద కేసు పెట్టి, ఆధారాలు ఇవ్వాలని ఇంటిమీద పడిసతాయిస్తారా.? తెలంగాణ పోలీసులు ఇచ్చారు కదా ఆధారాలు, నేరుగా వాళ్లే ఇచ్చారుగా. వాళ్లే వచ్చి రెయిడ్ చేసి కాల్పులు జరిపారుగా సిగ్గులేదా మీకు..? ఈ రోజు అగనంపూడిలో 1200 కేజీల గంజాయి పట్టుకున్నారు. సమాధానం చెప్పు డీజీపీ.? మాది తప్పైతే క్షమాపణ చెబుతాం..నీది తప్పైతే ఏం చేస్తారు.? ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దేశంలో పట్టుబడ్డ గంజాయి లింకులు ఎక్కడంటే విశాఖ పేరు వినబడుతోంది.  
మొన్నే దీని మీద బీబీసీ కథనం వేశారు..వేస్తారా కేసు.? 25 వేల ఎకరాల్లో గంజాయి పంట సాగవుతోంది. ఎనిమిది వందల కోట్ల విలువచేసే గంజాయి ధ్వంసం చేశామని పోలీసులు రాసుకున్నారు. కొంతమంది అసోషియేషన్ పోలీసులకు ఏం సంబంధం. హక్కులకు సంబంధించి పోరాడితే మద్దతిస్తాం. ఉద్యోగులకు ఇప్పుడు ఏమైంది. జీతాలు ఎప్పుడో ఒకసారి ఇస్తున్నామని మంత్రి అన్నారు. పీఆర్సీ ఇచ్చి, సీపీఎస్ రద్దు చేశారా? ఏమీ చేయకుండా అసోషియేషన్ లో కొందమందిని పెట్టుకుని సంఘాలను మేనేజ్ చేసి బెదిరించి, మాట్లాడితే కేసులు పెడతాం, సీబీసీఐడీ అంటూ అణగదొక్కుతారా.?  ఎన్ని రోజులు అణగదొక్కుతారు.? 
ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వచ్చింది. టీడీపీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు. ఇప్పుడు జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేవి.  రెండు రోజులు నిర్వహించిన ప్రభుత్వ ఉగ్రవాద దీక్షకు కార్యకర్తలంతా ఆగ్రహంతో, ఆవేశంతో, ధైర్యంగా వీరోచితంగా వచ్చారు.  ఆ ఆవేశాన్ని కార్యకర్తలు చంపుకోవద్దు. వైసీపీ చేసిన అవినీతి, అరాచకాన్ని ప్రజలకు వివరిద్దాం. దేశంలోనే పెట్రోల్ రేట్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గనిపించడంలేదా?
కేంద్రం పెట్రలో పై రూ.5, డీజీల్ పై రూ.10 తగ్గించింది. యూపీ, గుజరాత్, గోవా, కర్నాటక, అస్సాం, ఒడిశా రూ.7 లు తగ్గించాయి. మీరెందుకు తగ్గించరు జగన్మోహన్ రెడ్డి.? ఇష్టానుసారంగా ప్రజలపై పన్నులు వేస్తున్నారు.ఇది చెత్త ప్రభుత్వం కాబట్టే చెత్త మీద పన్ను వేస్తున్నారు. ప్రతి ఇంటికి రూ.60 నుండి రూ.120 చెత్త పన్ను వసూలు చేస్తున్నారు.నీటి పన్ను రూ.360, మరుగుదొడ్లు రెండు ఉంటే రూ.80 పన్ను విధిస్తున్నారు. ఆస్తి పన్ను పది రెట్లు కట్టాలా.? చిన్న పంచాయతీలకు గతంలో నరేగా నిధులు వచ్చేవి. ఇప్పుడు నరేగా నిధులు లేవు. వంద రోజుల ఉపాధిహామీ కూలీ పోయింది. 
మీరు ఇచ్చే బహుమానం పన్నులా.?ఫ్రీగా నీళ్లుతాగే వారిపై నీటి పన్ను వేస్తున్నారు. వీటికోసం మళ్లీ ఎన్నికలు, బెదిరింపులు, రిగ్గుంగులా.? నా జీవితంలో కుప్పంలో మొన్నిటి సభకు వచ్చినంతమంది జనం ఎప్పుడూ రాలేదు. కుప్పంలో ఏం చేయాలో చేసి చూపిస్తాం. కొందరు కల్చర్ లేకుండా మాట్లాడుతున్నారు. విద్యుత్ పై ట్రూ అప్ చార్జీలు వేస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదు. సొంత బ్రాండ్లతో నాసిరకం మద్యం తయారు చేసి అమ్ముతున్నారు. ప్రాణాలకు రక్షణ లేదు. పేదోడు కడుపునిండా తినే అన్నా క్యాంటీన్ తీసేశారు. అక్రమాలు జరిగితే నేనే ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళ్తా, కింది స్థాయి వరకూ వెళ్తా. 
★ దౌర్జన్యంగా ఓట్లేయించుకుంటామంటే మీ ఆటలు సాగవు. పట్టాభి మీద ఇంతక ముందు కూడా దాడి చేశారు. ఎవర్ని అరెస్టు చేశారు. పార్టీ కార్యాలయంపైనా దాడి చేశారు.. ఎవర్ని పట్టుకున్నారు.? వివేకానే చంపితేనే దిక్కులేదు..ఇవేం పెద్ద లెక్కకాదు అనుకుంటున్నారు.ప్రజలు వెంటాడితే రాష్ట్రం నుండి బయటకు పోలేవు..ఇంటి నుండి బయటకు కూడా రాలేరు. ఎవరు నేరంలో భాగస్వామ్యం అయ్యారో కమిషన్ పెట్టి బయటకు తీసుకొస్తాం. కోర్టు నిర్ణయాలు కూడా లెక్క చేయని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గతంలో కోర్టులో చిన్న కామెంట్లు వస్తే మంత్రులు రాజీనామా చేశారు. రవాణా శాఖలో సంజీవ్ రెడ్డి, మిడిల్ కాలేజీ పెట్టారని కామెంట్ వస్తే జనార్థన్ రెడ్డి రాజీనామా చేశారు. ప్రస్తుతం కోర్టులో వస్తున్న తీర్పులతో ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే ఎన్నిసార్లు రాజీనామా చేయాలి.? రాష్ట్రంలో ఐఎఎస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కొందరు ఇంకా నిజాయితీగా వున్నారు. తుగ్లక్ జగన్ తో కోర్టు చుట్టూ తిరగటానికి అధికారులు సిద్ధపడొద్దు.

Leave A Reply

Your email address will not be published.

At vero eos et accusamus et iusto odios un dignissimos ducimus qui blan ditiis prasixer esentium voluptatum un deleniti atqueste sites excep turiitate non providentsimils. Nemo enim ipsam voluptatem quia voluptas sit aspernatur aut odit aut fugit, consequunturser magni dolores.

Eos qui ratione voluptatem sequi nesciunt. Lorem ipsum dolor sit amet isse potenti. Vesquam ante aliquet lacusemper elit. Cras neque nulla, convallis non commodo et, euismod nonsese.

Accusamus et iusto odio dignissimos ducimus qui blanditiis praesentium voluptatum deleniti atque corrupti quos dolores et quas molestias excepturi sint occaecati cupiditate non provident

SEND US A MESSAGE

Please insert contact form shortcode here!

CONTACT INFO

12345 North Main Street,
New York, NY 555555

Phone: 1.800.123.4567
Email: info@betterstudio.com
Web: betterstudio.com