2020 నవంబర్ 14 న బాలల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవ బిశ్వ భూషణ్ హరిచందన్ వారి సందేశం…
మన తొలి ప్రధాని పండిట్ “జవహర్లాల్ నెహ్రూ “జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకునే బాలల దినోత్సవం సందర్భంగా… రాష్ట్రంలోని పిల్లలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. చిన్నారులపైనే దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. వారే రేపటి భావి భారత పౌరులు. చిన్నారులు దేశం యొక్క నిజమైన బలం, మనం జీవించే సమాజానికి పునాది. భవిష్యత్ పౌరులుగా, మాతృభూమిని రక్షించడం ఈ దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించడం భావి భారత పౌరులు గా వారి బాధ్యత. ” అని మాననీయ గవర్నర్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.