అనంత జర్నలిస్టులకు కరోనా వ్యాక్సిన్
వై.యస్ జగన్ సీ.ఎం జర్నలిస్టుల సమస్యలపై దృష్టి పెట్టాలి
అనంతలో జర్నలిస్టుల కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మచ్చా రామలింగారెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (APWJU).
👉రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే 5 లక్షల విడుదల చేయాలని మచ్చా రామలింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (A.P.W.J.U) డిమాండ్ చేశారు.
👉రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ప్రభుత్వం వెంటనే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా వేయాలని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కోరారు.
👉అనంతపురం నగరంలో వర్కింగ్ జర్నలిస్టులకు కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేసే కార్యక్రమాన్ని నగరంలో యూనియన్ కార్యాలయంలో మచ్చా రామలింగారెడ్డి ప్రారంభించారు.
👉మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ కరోనాతో రాష్ట్రంలో జర్నలిస్టులు 200 మందికి పైగా మరణించారని వారందరికీ వెంటనే ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని మచ్చా డిమాండ్ చేశారు.
👉వైయస్ జగన్ ముఖ్యమంత్రి కరోనా తో మృతి చెందిన జర్నలిస్టులకు 5 లక్షల ఆర్థిక సాయం చేయాలని, ప్రభుత్వం జి.ఓ ఇచ్చిన సమాచార శాఖ అధికారులు ఇప్పటివరకు ఒక జర్నలిస్టుకి కూడా సహాయం చేయక పోవడం దారుణమని అన్నారు.
👉రాష్ట్రంలో జర్నలిస్టులు అక్రిడేషన్లు లేక హెల్త్ కార్డులు పనిచేయక చాలా ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని అన్నారు.
👉రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై దశలవారీ ఉద్యమాన్ని చేయడం జరుగుతుందని జర్నలిస్టు రోడ్ ఎక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని మచ్చా అన్నారు.
👉అనంతపురంలో జర్నలిస్టులు కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు వెంకటేశులు, జిల్లా నాయకులు విజయరాజు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జానీ, షాకీర్, ఉపేంద్ర, చలపతి, దాదు శ్రీకాంత్, జర్నలిస్టులు పెద్ద ఎత్తున రెండో డోస్ వాక్సిన్ వేసుకోవడం జరిగింది.
💎ANDHRA PRADESH WORKING JOURNALIST UNION (A.P.W.J.U)💎