గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు…
ఈకార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ చుక్కా చంద్రపాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు సోనియాగాంధీ త్యాగాలకు నిలువెత్తు రూపం అని ఆయన అన్నారు తనకు ప్రధాన మంత్రిగా అవకాశం వచ్చినా తనను విదేశీయురాలు అన్న ఒక మాట కోసం ప్రధాన మంత్రి పదవిని త్రుణప్రాయంగా తిరస్కరించిన గొప్ప గొప్ప మహోన్నత మైన వెక్తి సోనియా గాంధీ అని ఆయన కొనియాడారు. అనంతరం పట్టణ అధ్యక్షులు దాసరి జ్ఞాన్ రాజ్ పాల్ మాట్లాడుతూ ఈదేశంలో భారతీయ జనతా పార్టీ అరాచక పరిపాలనను కొనసాగిస్తుందని ప్రజలందరు గమనిస్తున్నారని బీజేపీ పార్టీని త్వరలో ఇంటికి పంపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు షేక్ చాన్ బాషా కొత్త లక్ష్మయ్య షేక్ జలీల్ జానీ ఖాజావలి షేక్ సైదా దానమ్మ మొహన్ రావు షేక్ ఆరీఫ్ షేక్ మహబూబ్ వలి వెంకటేశ్వర్లు శేఖర్ తదితరులు పాల్గొన్నారు..