కేరళ..
శబరిమల లో కోవిడ్ నిబంధనలు..
మండలం పూజ సందర్భంగా కేరళలో శబరిమల ఆలయం తెరుచుకోనున్నది.. రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని కేరళ ప్రభుత్వం అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద కొన్ని నియమ నిబంధనలను ప్రవేశపెట్టింది. ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రతి భక్తుడు కోవిడ్ రూల్స్ పాటించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం సూచన చేశారు. అలానే ప్రతి భక్తుడు కోవిడ్ సర్టిఫికెట్ తీసుకురావాలన్న నిబంధనలు తీసుకువచ్చారు …
అధికారులు.ప్రతిరోజూ గరిష్టంగా 250 మందిని ఆలయం లోపలకి అనుమతిస్తారు. అంతేకాదు 10 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు . రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య అయ్యప్ప స్వామిని దర్శించాలనుకునే వారు కఠినమైన ప్రోటోకాల్స్ పాటించాల్సిందే . కరోనా నెగిటివ్ రిపోర్ట్ ను తీసుకోని వారి కోసం నీలాకల్ బేస్ క్యాంప్ వద్ద రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. కరోనా నెగిటివ్ నిర్ధారణ అయితేనే అయ్యప్ప దర్శనానికి అనుమతి ఇస్తారు …