అనంతపురం జిల్లా నుండీ డయల్ – 100 కు గత నెలలో 2,065 ఫోన్ కాల్స్. డయల్ – 100 కు వచ్చిన అన్ని కాల్స్ కు పోలీసుల తక్షణ స్పందన.. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS
అనంతపురం జిల్లా నుండీ డయల్ – 100 కు అక్టోబర్ నెలలో వచ్చిన అన్ని కాల్స్ కు పోలీసుల తక్షణమే స్పందించారు. గత నెలలో మొత్తం జిల్లా నుండీ 2,065 ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఇందులో 63 కేసులు కూడా నమోదు చేశారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రుల్లో చేర్పించి ప్రాణాలు రక్షించడం వివిధ కారణాలుతో ఆత్మహత్యాయత్నాలకు పాల్పడిన వారిని కాపాడటం.
బాడిలీ అఫెన్సెస్ తీవ్రం కాకుండా కట్టడి చేయడం…ఇలా జిల్లాలో పోలీసులు ఎన్నో ప్రజోపయోగ సేవలు అందించారు. గత నెలలో జిల్లా నుండీ డయల్ – 100 కు వచ్చిన కాల్స్ … పోలీసుల స్పందన, పనితీరుపై జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు సమీక్షించి ఆ గణాంకాలను వెల్లడించారు.
30 మంది రోడ్డు ప్రమాద క్షతగాత్రుల ప్రాణాలు కాపాడిన పోలీసులు
జిల్లాలో వేర్వేరు సందర్భాలలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లోని 30 మంది క్షతగాత్రుల ప్రాణాలను పోలీసులు కాపాడారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే సంబంధిత రోడ్ సేఫ్టీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆగమేఘాలపై సమీపంలోని ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు చేయించడం వలన 30 మంది ప్రాణాలు సురక్షితమయ్యాయి
17 మంది ఆత్మహత్యాయత్నాలు నిలువ రింపు..
జిల్లాలో వేర్వేరు కారణాలతో ఆత్మహత్యా యత్నాలకు వేర్వేరుగా పాల్పడిన 17 మందిని తాడిపత్రి అర్భన్ , హిందూపురం 1 టౌన్ , పుట్టపర్తి అర్బన్ , బుక్కరాయసముద్రం, రాయదుర్గం, గార్లదిన్నె, గుంతకల్లు 1 టౌన్ , ధర్మవరం అర్బన్ , కొత్తచెర్వు, పెద్దపప్పూరు, గుత్తి, అనంతపురం 4 వ పట్టణం, కదిరి రూరల్ , కదిరి అర్బన్ పోలీసులు సంబంధిత బ్లూకోల్ట్ సిబ్బందితో కలిసి నిలువరించారు. ఆతర్వాత కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా కుటుంబాలకు కుటుంబ సభ్యులకు వారిని అప్పగించారు. మరో 23 మంది ప్రయాణీకులను వరద నీటిలో చిక్కుకున్న బస్సు నుండీ ఆత్మకూరు, తదితర పోలీసులు కాపాడారు.
5 బాల్య వివాహాల నిలుపుదల… జిల్లాలోని రాప్తాడు, గార్లదిన్నె, గుంతకల్లు 2 టౌన్ , వజ్రకరూరు పోలీసు స్టేషన్ల పరిధిలో వేర్వేరుగా జరుగుతున్న 5 బాల్య వివాహాలను సంబంధిత విభాగం సిబ్బందితో కలసి ఆ పోలీసులు నిలుపదల చేశారు.
బాడిలీ అఫెన్స్ కట్టడి… కేసు నమోదు..కూడేరు, తాడిమర్రి, పుట్టపర్తి రూరల్ పోలీసు స్టేషన్ల పరిధిలో చోటు చేసుకున్న బాడిలీ అఫెన్స్ లు తీవ్రం కాకుండా ఆయా పోలీసులు కట్టడి చేశారు. ఒక కేసు కూడా నమోదు చేశారు.
తప్పిపోయిన ఆరుగురు చిన్నారులను ఆయా తల్లిదండ్రులకు అప్పగింత
అనంతపురం 4 పట్టణం, హిందూపురం 2 టౌన్ , కనేకల్లు & గుత్తి, కదిరి పట్టణాలలో వేర్వేరుగా తప్పిపోయిన ఆరుగురు చిన్నారులను ఆయా పోలీసులు పట్టుకుని ఆ తల్లిదండ్రులకు అప్పగించారు.
పేకాటపై చర్యలు… 31 మంది అరెస్టు, రూ. 94,177/- స్వాధీనం. సోమందేపల్లి, గుత్తి, బుక్కరాయసముద్రం, తనకల్లు, అనంతపురం 1 టౌన్ పోలీసులు వేర్వేరుగా పేకాటపై చర్యలు తీసుకున్నారు. 31 మందిని అరెస్టు చేసి రూ. 94,177/- నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు ఈవ్ టీజర్లకు కౌన్సెలింగ్ … కేసు నమోదు..అనంతపురం 4 వ పట్టణ, మడకశిర, సోమందేపల్లి పోలీసు స్టేషన్ల పరిధిల్లో వేర్వేరుగా అమ్మాయిలను వేధిస్తున్న ఇద్దరు ఈవ్ టీజర్ లను ఆయా పోలీసులు పట్టుకుని కౌన్సెలింగ్ చేశారు. ఇంకొకరిపై కేసు నమోదు చేశారు.