తూ.గో. జిల్లాలో పెళ్లి వ్యాన్ బోల్తా ఆరుగురు మృతి.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
ఓ పెండ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాను కొండపైనుంచి కింద పడటంతో ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందారు, మరో నలుగురు తీవ్రంగా గాయడపడ్డారు.
పెళ్లి వేడుకలు ముగించుకుని తిరిగి వెళ్తున్న వ్యాను జిల్లాలోని గోకవరం మండలం తంటికొండ వేకంటేశ్వర స్వామి ఆలయం వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో కొండపైనుంచి కిందపడింది.ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులతోకలిసి సహాయకచర్యలు చేపట్టారు.ఈ ప్రమాదం ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో జరిగిందని పోలీసులు తెలిపారు.ఈఘటనలో ఆరుగురు మృతిచెందారు, తీవ్రంగా గాయపడిన నలుగురిని రాజమహేంద్రవరం దవాఖానకు తరలించామని పోలీసులు వెల్లడించారు.మృతులు గోకవరం మండలం టాకుర్పాలెం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.ప్రమాద సమయంలో వ్యానులో 22 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు .