ప్రపంచ క్రీడల్లో తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆధిపత్యం కొనసాగుతోంది. ఒలింపిక్స్ స్వర్ణ పతకంపై గురిపెట్టిన సింధు.
వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తాజాగా ఒలింపిక్స్ మహిళ సింగిల్స్‌లో పి.వి.సింధు క్వార్టర్స్‌కు చేరింది. ఈ మేరకు ప్రీక్వార్టర్స్‌లో మియా బ్లిక్ఫెల్డ్ (డెన్మార్క్)ను చిత్తు చేసింది. 21-15, 21-13తో బ్లిక్ఫెల్డ్పై సింధు ఘన విజయం సాధించింది. కాగా, మహిళల సింగిల్స్ గ్రూప్-జెలో సింధు వరుసగా 3 విజయాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.