దివ్యాంగులు కృత్రిమ అవయవాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల కృత్రిమ అవయవాలను ఉపయోగించుకోవాలని, కృత్రిమ అవయవాల వల్ల దివ్యాంగులకు కొత్తజీవితం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు రసూల్ మాట్లాడుతూ ఇంతకు ముందు తమకు కృత్రిమ అవయవాలు కావాలని ముగ్గురు దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, వారికి అనంతపురం జిల్లా ఆస్పత్రిలో ఉన్న కృత్రిమ అవయవాల కేంద్రం నుంచి తయారుచేసిన క్యాలిపర్, చంక కర్రలు, కృత్రిమ అవయవాలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈరోజు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అందులో తాడిపత్రి చెందిన మహబూబ్ భాషా కు క్యాలిపర్ ను, అనంతపురంకు చెందిన వెంకటస్వామికి చంక కర్రలు మరియు క్యాలిపర్, అనంతపురం కు చెందిన వెంకటరమణ కృత్రిమ అవయవాన్ని అందజేయడం జరిగిందన్నారు. కృత్రిమ అవయవాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.