గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో కాంగ్రెస్ నాయకులు పక్కాల సూరిబాబు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కన్నా లక్ష్మీనారాయణ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు …
ఈసందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ టిడిపి, వైసీపీ రెండు వారసత్వ పార్టీలని వారిలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరు లేరని ఆయన దయ్యపట్టారు, కేంద్ర పథకాల నిధులకు గత ప్రభుత్వం. ప్రస్తుత ప్రభుత్వం వారి పేరులు పెట్టుకొని మోదీని నిందిస్తున్నారని విమర్శించారు, ఇప్పటికే కులాల పేరుతో మతాల పేరుతో విడదీసి పథకాలు అమలుచేస్తున్నారని, ఈరెండు పార్టీలు కుటుంబాల పార్టీలని దుయ్యబట్టారు, ఒక్క బిజెపి మాత్రమే ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు , ప్రజల పక్షాన పనిచేస్తున్న రాజకీయ పార్టీ అని తెలిపారు. మన రాష్ట్రానికి 23 లక్షలు ఇళ్ళు కట్టటానికి 25కోట్లు మంజూరు చేసిన ఘనత కేంద్ర సర్కారు సబ్సిడీపై ఇచ్చారని అన్నారు, కానీ కేవలం వాటిని కట్టలేక 8 లక్షల ఇళ్లు వెనక్కి పోయాయని సోము తెలిపారు. ప్రతి మనిషికి స్వచ్ఛభారత్ ,NRGS. ఇలాంటి వాటికి మోదీ ప్రభుత్వం డబ్బులు వేచ్చించిన ఘనత…. మోదీ ప్రభుత్వం చేపట్టిన వాటిని కూడా దారిమళ్లిస్తున్న చరిత్ర ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందని తెలియజేసారు, గతంలో చంద్రబాబు మోదీని రాష్ట్రంలోకి రాకుండా నల్లజండాలతో నిరసన తెలిపిన చంద్రబాబు, నేడు రాష్ట్రానికి మోదీ పర్యటన చేయటం లేదని విమర్శలు చేస్తున్నారని వివరించారు, మోదీ గుంటూరు జిల్లాకి ఒక మెడికల్ కాలేజి, ఒక ఎయిమ్స్, వారదీపై ప్లై ఓవర్, ఔటర్ రింగ్ రోడ్డు, వంటి అభివృద్ధి పనులు చేసారని ఇంకా అనేక పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు, ఏపీలో కుటుంబ పాలనకు శరమగీతం పాడేరోజులు త్వరలోనే వస్తుందని జోస్యం చెప్పారు. కర్మాకార కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదేనని గుర్తు చేశారు, దండోరా నాయకులకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన చెప్పారు, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే పార్టీ ఒక బీజేపీ పార్టీనేనని సోము వీర్రాజు తెలిపారు. కార్యక్రమంలో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, నాయకులు రావెల కిషోర్ బాబు, జిల్లా అధ్యక్షులు కర్ణ సైదా రావు, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు. సూరిబాబు అభిమానులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నీ, కన్నా లక్ష్మీ నారాయణ నీ పక్కాల సూరిబాబు ఘనంగా సన్మానించారు.