కరోనా నెగిటివ్ వచ్చింది మెగాస్టార్ చిరంజీవి….
మెగాస్టార్ చిరంజీవిని కరోనా మహమ్మారి ఓ ఆట పట్టించింది . ఎట్టకేలకు చిరంజీవికి కరోనా నెగిటివ్ అని తేలింది. ఈ వారం చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి తెలిపాడు. అయితే ఈరోజు తన ఆరోగ్యంపై చిరంజీవి మరో ట్వీట్ చేశాడు. కరోనా గత నాలుగు రోజులుగా నన్ను అయోమయం చేసి నాతో ఆడేసుకుంది. ఆదివారం టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో ఐసోలేషన్‌లో ఉన్నాను. రెండు రోజులైనా నాకు ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో అనుమానం వచ్చి అపోలో లో పరీక్షలు చేయించుకున్నాను. అక్కడ రిపోర్ట్‌లో కరోనా నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ మరో రెండు చోట్ల కరోనా పరీక్షలు చేయించుకున్నాను.అక్కడ కూడా కరోనా నెగిటివ్ వచ్చింది. నాకు పాజిటివ్ రావడానికి కారణం ఫాల్ట్ కిట్టు అని వైద్యులు నిర్ధారించారు. కరోనా సమయంలో నా కోసం నా ఆరోగ్యం కోసం పూజలు చేసిన వారికి… అభిమానులకు నా కృతజ్ఞతలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.